హైదరాబాద్ లో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ప్రియురాలిపై జొమాటోలో పనిచేసే ప్రియుడు కత్తితో దాడి!
- కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వాసవి, గణేశ్
- నిన్న రాత్రి నార్సింగిలోని హోటల్ వద్దకు రావాలని పిలిచిన గణేశ్
- దాడిలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలు
నిన్న రాత్రి వాసవిని నార్సింగిలోని టీ గ్రిల్ హోటల్ వద్దకు రావాలని గణేశ్ పిలిచాడు. దీంతో ఆమె హోటల్ వద్దకు వచ్చింది. కాసేపటి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తన బ్యాగ్ లో నుంచి కత్తిని తీసి వాసవిపై గణేశ్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఆమె మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, గణేశ్ కోసం గాలిస్తున్నారు.