KR Suryanarayana: అజ్ఞాతంలో ఉన్న ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్ట్?

AP Employees Leader Suryanarayana Arrested
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై గత నెల 31న విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఏ5 నిందితుడిగా ఉన్నారు. 

ముందస్తు బెయిలు కోసం విజయవాడ ఏడీజే కోర్టులో వేసిన పిటిషన్‌ ఈ నెల 15న తిరస్కరణకు గురైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విశాఖపట్టణం, విజయవాడ, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఆయన కోసం పోలీసులు గాలించారు. 

చివరికి నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Go Back to Shorts
KR Suryanarayana
Andhra Pradesh
Vijayawada

More Telugu News