విజయాలు చాలా చూశా.. కానీ 'ఇరుముడి' నాకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
- 'ఇరుముడి' చిత్రానికి అరుదైన గౌరవం దక్కిందన్న రవితేజ
- విజయాలకు మించి కళాకారుడిగా గౌరవం సంపాదించి పెట్టిందని వెల్లడి
- దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌పై ప్రశంసలు
- డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో ఆనందం రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని వ్యాఖ్య
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరుతో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు ఒక నటుడిగా ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. "నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, పరాజయాలు చూశాను. కానీ ఒక కళాకారుడిగా సమాజంలో నాకు లభించిన గౌరవానికి ‘ఇరుముడి’ ప్రత్యేక కారణమైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఒక ఎత్తయితే, నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని, అపారమైన గౌరవాన్ని సంపాదించుకోవడం మరో ఎత్తు. ఈ సినిమా నాకు ఆ అనుభూతిని ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో కనిపించిన సంతృప్తి నాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది" అని అన్నారు.
ఈ ఘనతకు అసలైన కారణం దర్శకుడు శివ నిర్వాణ అని రవితేజ ప్రశంసించారు. "సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆయన పడిన శ్రమ వర్ణనాతీతం. రాత్రింబవళ్లు తేడా లేకుండా పనిచేస్తూ మమ్మల్ని నడిపించారు. నా కెరీర్‌లో ఇంతగా నైట్ షూటింగుల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ఆత్మలా నిలిచింది" అని కొనియాడారు. ఈ విజయోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ డివోషనల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. సాయికుమార్, చిన్నారి నక్షత్ర కీలక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.