పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
- జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు
- సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం
- ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కల్పించినట్లు అధికారుల వెల్లడి
ఈ నెల 18న సికింద్రాబాద్ నుండి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుండి సికింద్రాబాద్ కు, ఈ నెల 19న నాందేడ్ నుండి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుండి నాందెడ్ కు, ఈ నెల 21న కాచిగూడ నుండి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుండి కాచిగూడకు రైళ్లు నడుపుతున్నారు.