మేం కట్టిన ఇళ్లకు మీరు రంగులేసుకున్నారు.. వైసీపీపై దేవినేని ఉమ ఫైర్
- రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఉమ ఎద్దేవా
- టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామన్న టీడీపీ నేత
- మీరెన్ని కట్టారో చెప్పాలని డిమాండ్
టిడ్కో ఇళ్లను టీడీపీ నిర్మించిన విషయం కొడాలి నానికి తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మూలన పడేసిన ఇళ్లను ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా రంగులేసి తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లు అంటారని, రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామని, నాలుగేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.