మారిన నా వ్యూహంతో ఇప్పుడు వాళ్లకు నిద్ర పట్టడం లేదు: పొంగులేటి
- ఖమ్మంలో ప్రధాన అనుచరులతో ముగిసిన శ్రీనివాస్ రెడ్డి భేటీ
- బీఆర్ఎస్ కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని కామెంట్
- ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటన
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై తాను యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతోందన్నారు. రాబోయే కురుక్షేత్రంలో తనను తట్టుకోలేమని, ఎన్నికల్లో గెలవక మళ్లీ ప్రజా ప్రతినిధులు కాలేమని వాపోతున్నారని ఎద్దేవా చేశారు. తండ్రిలా భావించిన కేసీఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నోసార్లు అవమానించినా ఓర్చుకొని, సహనంతో ఉన్నానని చెప్పారు. ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరించారు.