ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే..!
- దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
- అంతర్జాతీయంగా హైదరాబాద్ కు 202వ స్థానం
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంగ్ కాంగ్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా హాంగ్ కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నివాసం, ఆహారం, రవాణా, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు, వస్త్రాలు.. ఇలా 200 వ్యయాల ఆధారంగా నివేదికను రూపొందించారు. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలంటే ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా అనుకూలమని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో తక్కువ ఖరీదైన నగరాల్లో పాకిస్థాన్ కు చెందిన కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి.