ఆడేది అందుకోసమే కదా: రోహిత్ శర్మ
- రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- ఓవల్ లో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా, ఆసీస్
- కెప్టెన్సీ వదులుకునే లోపు ఒకట్రెండు టోర్నీలు గెలవాలనుందని రోహిత్ ఆకాంక్ష
"నేను గానీ, నాకంటే ముందు కెప్టెన్సీ నిర్వర్తించినవారు కానీ, నా తర్వాత వచ్చే వారు కానీ... భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడం, వీలైనన్ని మ్యాచ్ లు, వీలైనన్ని టోర్నీలు గెలవడమే వారి కర్తవ్యం. నాకైనా ఇదే వర్తిస్తుంది. మ్యాచ్ లు గెలవాలని, చాంపియన్ షిప్ లు గెలవాలని ఆకాంక్షిస్తాను. ఎవరైనా ఆడేది గెలుపు కోసమే కదా" అని రోహిత్ శర్మ వివరించాడు.