హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇప్పుడు మరింత సరికొత్తగా!

Hero Motocorp updates HF Deluxe bike
  • అత్యధికంగా అమ్ముడుపోయే బైక్ లలో ఒకటి హెచ్ఎఫ్ డీలక్స్
  • హెచ్ఎఫ్ డీలక్స్ లో కొత్త హంగులు
  • కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ తీసుకువచ్చిన హీరో మోటోకార్ప్
దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే బైక్ లలో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి. దీన్ని దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తయారు చేస్తోంది. తక్కువ ధరలో, మెరుగైన మైలేజ్ ఇచ్చే బైక్ గా హెచ్ఎఫ్ డీలక్స్ ప్రజాదరణ పొందింది. తాజాగా హీరో మోటోకార్ప్ హెచ్ఎఫ్ డీలక్స్ కు అప్ డేటెడ్ వెర్షన్ తీసుకువచ్చింది. కాన్వాస్ బ్లాక్ పేరిట సరికొత్త ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. 

కాన్వాస్ బ్లాక్ వేరియంట్ బైక్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్ తో డిజైన్ చేశారు. ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, అల్లాయ్ వీల్స్, బాడీ వర్క్ అంటా బ్లాక్ టోన్ లోనే ఉంటుంది. చవకధరల్లో స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కొనాలనుకునేవారికి హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ మంచి ఎంపిక అవుతుంది. 

అప్ డేట్ చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి కిక్ స్టార్ట్ వేరియంట్ కాగా, రెండోది సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. కిక్ స్టార్ట్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.60,760 కాగా... సెల్ఫ్ స్టార్ట్ మోడల్ ధర రూ.66,408గా పేర్కొన్నారు. బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్, నెక్జస్ బ్లూ, హెవీ గ్రే విత్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ వేరియంట్లలోనూ ఇది లభ్యమవుతుంది. 

ట్యూబ్ లెస్ టైర్లు, ఐ3ఎస్ టెక్నాలజీతో సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని హీరో నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా బైక్ లోనే యూఎస్ బీ చార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
HF Deluxe
Canvas Black
Hero Motocorp
India

More Telugu News