Advertisement

హయత్ నగర్ రాజేశ్ మృతిలో కొత్త కోణాలు.. టీచర్ సుజాతతో పరిచయం ఎక్కడకు దారి తీసిందంటే..!

news twists in Sujatha and Rajesh death case
  • రాంగ్ నెంబర్ ద్వారా రాజేశ్ కు సుజాత పరిచయం
  • సుజాతను పెళ్లి చేసుకోవాలనుకున్న రాజేశ్
  • సుజాతకు అప్పటికే పెళ్లయినప్పటికీ మోసం చేసిందని ఆగ్రహం
  • దూరంగా ఉంటున్న రాజేశ్ కు సుజాత మెసేజ్
  • సుజాతను కలిసేందుకు వచ్చిన రాజేశ్ పై దాడి!
హయత్ నగర్ రాజేశ్ మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజేశ్, టీచర్ సుజాత మధ్య పరిచయం కూడా ఆసక్తికరంగా జరిగింది. ఈ మేరకు మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం సుజాత చేసిన రాంగ్ డయల్ రాజేశ్ కు వచ్చింది. ఈ రాంగ్ డయల్ తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. టీచర్ సుజాత, రాజేశ్ మధ్య తరుచూ వాట్సాప్ సందేశాలు జరిగాయి. సుజాత డీపీని చూసి ఆమెకు వివాహం కాలేదని భావించాడు రాజేశ్. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుజాతతో కలిసి పలుమార్లు దేవరకొండ వరకు కారులో వెళ్లాడు.

కొన్ని నెలల పరిచయం తర్వాత సుజాతకు వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. తనను సుజాత మోసం చేసిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజేశ్. అంతేకాదు ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు. కానీ ఓసారి కలుద్దాం రమ్మంటూ సుజాత అతనికి మెసేజ్ పెట్టింది. రాజేశ్ స్పందించకపోవడంతో చనిపోతానని బెదిరించింది. నువ్వు చనిపోతానని బెదిరిస్తే.. నేను కూడా చనిపోతానని రాజేశ్ ఆమెతో చెప్పాడు.

ఈ క్రమంలో సుజాతను కలిసేందుకు హయత్ నగర్ వచ్చాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేశ్, సుజాత వ్యవహారం సుజాత కొడుకు, కూతురుకు తెలిసింది. రాజేశ్ రాగానే ముగ్గురితో కలిసి అతనిపై దాడి చేశాడు సుజాత కొడుకు. రాజేశ్ భయంతో మందు తాగాడు. తర్వాత సుజాత ఇంటికి సమీపంలో శవమై తేలాడు. అయితే, రాజేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను దాడి చేయడం వల్ల చనిపోయాడా? లేక తాగిన మైకంలో చనిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పోలీసులు చర్యలు తీసుకుంటారు.
Advertisement
sujatha

More Telugu News