వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

Shock to Erra Gangireddy in Supreme Court
  • జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలని ఉత్తర్వులు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సునీత
  • హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీం 
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళ్తే... గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు గడువు విధించినందున ... జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
Advertisement
Erra Gangireddy
YS Vivekananda Reddy
Supreme Court

More Telugu News