'సత్తిగాని రెండెకరాలు' ట్రైలర్ రిలీజ్!

Sathigani Rendekaralu movie trailer released
  • జగదీశ్ హీరోగా 'సత్తిగాని రెండెకరాలు'
  • కొల్లూరు నేపథ్యంలో అల్లుకున్న కథ 
  • డార్క్ కామెడీ జోనర్లో నడిచే సినిమా 
  • ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్   
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రధాన పాత్రధారిగా 'సతిగాని రెండెకరాలు' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అభినవ్ దండ దర్శకత్వం వహించాడు. కొల్లూరు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వెన్నెల కిశోర్ .. భవాని శ్రీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా  'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును కొంతసేపటి క్రితం నిర్వహించారు. వెంకీ కుడుముల .. హను రాఘవపూడి .. సుహాస్ .. సత్యదేవ్ .. అనుదీప్ తదితరులు హాజరయ్యారు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

సత్తిగాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అతను తనకి ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్ముకోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ. డార్క్ కామెడీ జోనర్లో సాగే ఈ కథ ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి.

Advertisement
Jagadeesh
Vennela Kishore
Bhavanisree

More Telugu News