నెల్లూరులో ఏం జరిగినా నాపై బురద చల్లుతున్నారు: మాజీ మంత్రి అనిల్ కుమార్
- నెల్లూరు వైసీపీలో విభేదాలు
- వైసీపీ విద్యార్థి నేత హాజీపై దాడి
- మాజీ మంత్రి అనిల్ కుమార్ పై ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయర్
- తప్పుడు ఆరోపణలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చిన అనిల్
అనంతరం ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బాధితుడితో మాట్లాడానని, ఈ దాడి వెనుక అనిల్ కుమార్ హస్తం ఉందని చెబుతున్నాడని, ఇలాంటి దాడులు సరికాదని వ్యాఖ్యానించారు.
దీనిపై అనిల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరులో ఏం జరిగినా తనపై బురద చల్లుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేదిలేదు అంటూ హెచ్చరించారు.