CSK: ధోనీ సేన ప్లే ఆఫ్ చేరాలంటే ఇలా జరగాలి!

CSK won the toss
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజన్ లో లీగ్ దశ రేపటితో ముగియనుంది. ఇవాళ, రేపు డబుల్ హెడర్ లు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. కాగా, టాస్ గెలిచిన సీఎస్కే సారథి ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

టాస్ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, టోర్నీ తొలి గేమ్ నుంచి విజయమే లక్ష్యంగా ఆడుతున్నామని వెల్లడించాడు. ఇవాళ్టి మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించాడు. ఇది ఒక సమతూకంతో ఉన్న జట్టని, మార్పులు చేయదలుచుకోలేదని ధోనీ తెలిపాడు. ఢిల్లీ పిచ్ మ్యాచ్ జరిగే కొద్దీ స్లో అవుతుందని, అందుకే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నామని స్పష్టం చేశాడు.

కాగా, ఈసారి ఐపీఎల్ లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఒక్కటే ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. మరో 3 ప్లేఆఫ్ బెర్తులు మిగిలుండగా, రేసులో 5 జట్లు ఉన్నాయి. ప్లేఆఫ్ బెర్తు దక్కాలంటే చెన్నై సూపర్ కింగ్స్ నేడు ఢిల్లీతో మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. 


Go Back to Shorts
CSK
Toss
Batting
Delhi Capitals
IPL

More Telugu News