కోదాడలో మెజారిటీ అంతకంటే తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఉత్తమ్ కుమార్ శపథం
- కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశం
- నియోజకవర్గ ఎమ్మెల్యేపై విమర్శలు
- సొంతపార్టీ నేతలే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
పోలీసులు తమ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదన్నారు. సొంతపార్టీ నేతలే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఉత్తమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.