భారీ షాట్లు కొట్టి పంజాబ్ కు భారీ స్కోరు అందించిన షారుఖ్ ఖాన్, శామ్ కరన్

భారీ షాట్లు కొట్టి పంజాబ్ కు భారీ స్కోరు అందించిన షారుఖ్ ఖాన్, శామ్ కరన్

Sharukh Khan and Sam Curran hammers Rajasthan Royals bowling
  • ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
  • రాణించిన జితేశ్, షారుఖ్, శామ్ కరన్
  • నవదీప్ సైనీకి 3 వికెట్లు
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఏ 150 పరుగులకో పరిమితం అవుతుందనుకున్న పంజాబ్ కింగ్స్ చివరికి భారీ స్కోరు సాధించింది. షారుఖ్ ఖాన్, శామ్ కరన్ భారీ షాట్లతో విజృంభించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు నమోదు చేసింది.

షారుఖ్ ఖాన్, శామ్ కరన్ జోడీ ఆఖరి 5 ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది. షారుఖ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు, శామ్ కరన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 

అంతకుముందు, పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ కూడా ధాటిగా ఆడాడు. జితేశ్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 70 పరుగులు సాధించడం విశేషం. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 2, కెప్టెన్ శిఖర్ ధావన్ 17, అథర్వ తైడే 19, లియామ్ లివింగ్ స్టోన్ 9 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు.
Advertisement
Sharukh Khan
Sam Curran
Punjab Kings
Rajasthan Royals
IPL

More Telugu News