కొడాలి నాని వంటి వారిని జైలుకు పంపిస్తాం!: ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్
- గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశం చేస్తున్నారన్న సునీల్
- కొడాలి వంటి వ్యక్తి జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని విజ్ఞప్తి
- బూతులు తిట్టి ఫేమస్ అయ్యాడని నానిపై ఆగ్రహం
కొడాలి నాని వంటి వ్యక్తి జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బూతులు మాట్లాడి ఫేమస్ కావడం తప్ప అతను ఏం చేశాడని నిలదీశారు. ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల ఏపీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.