యువగళం సంఘీభావయాత్రలో కార్యకర్తల హంగామా.. మీసాలు మెలేసిన వైసీపీ ఎమ్మెల్యే
- వినుకొండ యాత్రలో టీడీపీ కార్యకర్తలకు ఎదురుపడిన వైసీపీ ఎమ్మెల్యే వాహనం
- జై తెలుగుదేశం అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు
- కారు దిగి, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
ఎమ్మెల్యే వాహనం ముందు టీడీపీ కార్యకర్తలు కాస్త హంగామా చేశారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన ఎమ్మెల్యే కారు దిగి, టీడీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. దమ్ముంటే రావాలని మీసాలు మెలేశారు. పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కార్యకర్తలను నిలువరించి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అక్కడి నుండి పంపించారు.