కోల్‌కతా మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ కు జరిమానా

కోల్‌కతా మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ కు జరిమానా

Jos Buttler Fined 10 Percent Of His Match Fee
  • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించిన ఐపీఎల్
  • ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1స్థాయి ఉల్లంఘన
  • రనౌట్ సమయంలో అతని వ్యవహారశైలి కారణంగా జరిమానా!
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను బట్లర్ కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు అతడు పాల్పడినట్లు తెలిపింది. ఇందులో మ్యాచ్ రెఫరీ నిర్ణయమే అంతిమమని ఐపీఎల్ తెలిపింది. మ్యాచ్ సమయంలో బట్లర్ ప్రవర్తనపై ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, రనౌట్ అయిన సమయంలో అతడి వ్యవహారశైలి కారణంగా జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.
Advertisement
Rajasthan
ipl

More Telugu News