Goutham Thinnanuri: ఇది చరణ్ కి చెప్పిన కథేనట!

  • 'జెర్సీ'తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి 
  • విజయ్ దేవరకొండతో నెక్స్ట్ మూవీ 
  • స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న సినిమా  
Vijay Devarakonda and Goutham Thinnanuri Movie

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా, ఆయన కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. సితార బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల కథా నాయికగా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఇంతకుముందు చరణ్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ కాంబో అంతకుమించి ముందుకు వెళ్లలేకపోయింది. ఇక అదే కథను ఆయన విజయ్ దేవరకొండకి చెప్పి ఒప్పించాడట. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. 

'గూఢచారి' సినిమా హిట్ తరువాత మళ్లీ స్పై థ్రిల్లర్ జోనర్లో సినిమాలు రావడం మొదలైంది. ఇటీవల వచ్చిన అఖిల్ 'ఏజెంట్' .. త్వరలో రానున్న నిఖిల్ 'స్పై' కూడా ఈ తరహా జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కూడా అదే జోనర్లో రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో ఇక్కడ హిట్ అందుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

More Telugu News