నా సక్సెస్ కు ఇదే కారణం: హార్దిక్ పాండ్యా
- ఐపీఎల్ లో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్
- నిన్న రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన వైనం
- అంతకు ముందు మ్యాచ్ లో జట్టును గెలిపించలేకపోయిన పాండ్యా
గత మ్యాచ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు జరిగాయని... నిన్న జరిగిన మ్యాచ్ లో ఆ పొరపాట్లకు తావివ్వలేదని పాండ్యా చెప్పారు. తాను బ్యాటింగ్ కు వచ్చేసరికే సగం టార్గెట్ ను ఓపెనర్లు కొట్టేశారని అన్నాడు. తప్పులను అంగీకరించడానికి తాను ఎప్పుడూ సిగ్గుపడనని... తన సక్సెస్ వెనకున్న కారణం ఇదేనని చెప్పాడు. నిన్నటి మ్యాచ్ లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబునిచ్చాడు.