Agent: ఏజెంట్ కు రెండో రోజు వచ్చింది లక్షలేనా?

Agent crashes at the Box office  Nizam 2nd day share Embarassingly low 21 Lakhs
షార్ట్స్‌లో చూడండి
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. ఈ  స్పై యాక్షన్ థ్రిల్లింగ్ సినిమాపై అఖిల్, సురేందర్ రెడ్డి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తొలి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. రెండో రోజే బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 4 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు 67 లక్షలు మాత్రమే సాధించింది.

ఇందులో  నైజాం ఏరియాలో  రెండో రోజు కేవలం రూ. 21 లక్షలు మాత్రమే వచ్చాయి. రెండేళ్ల కాలంలో దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం గగనమే అనిపిస్తోంది.
Go Back to Shorts
Agent
Box office
Nizam 2nd day
share
21 Lakhs

More Telugu News