తడి గుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తడి గుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు: రోజా

Roja fires on Chandrababu
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం హాస్యాస్పదమన్న రోజా
  • ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్న
  • గతంలో మోదీని తిట్టి ఇప్పుడు మోదీ విజన్ సూపర్ అంటున్నారని విమర్శ
దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. 

తడి గుడ్డతో గొంతు కోసే నైజం చంద్రబాబుదని విమర్శించారు. భార్యని కూడా చూసుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని మోదీని చంద్రబాబు తిట్టారని... ఇప్పుడేమో నేషనల్ మీడియాలో మోదీ విజన్ సూపర్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నైజం ఇలాగే ఉంటుందని చెప్పారు.
Advertisement
Roja
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News