Rajasthan Royals: నేడు ధోనీ సేన ప్రతీకారం తీర్చుకునేనా?

Rajasthan Royals won the toss and elected bat first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. సొంతగడ్డ జైపూర్ లో ఈ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ, సంజు శాంసన్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బాట్స్ మన్లు కెప్టెన్లుగా ఉన్న జట్లు మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. 

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఏప్రిల్ 12న మ్యాచ్ జరగ్గా... ఆ పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్ లో రాజస్థాన్ మొదట 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేయగా... ఛేజింగ్ లో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ లో ధోనీ ఆఖర్లో విజృంభించినా ఫలితం లేకపోయింది. 

ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని ధోనీ సేన నేడు తహతహలాడుతోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ కి చేరుతుంది.
Go Back to Shorts
Rajasthan Royals
Chennai Superkings
Toss
Jaipur
IPL

More Telugu News