ముంబై ఇండియన్స్ కు మరో షాక్.. జట్టును విడిచిన స్టార్ పేసర్
- మోచేయి గాయంతో బాధపడుతున్న ఆర్చర్
- శస్త్ర చికిత్స కోసం బెల్జియం వెళ్లిన పేసర్
- ఈ సీజన్ లో నిరాశ పరుస్తున్న ముంబై జట్టు
తన గాయానికి చిన్న శస్త్రచికిత్స కోసం ఆర్చర్ ముంబై జట్టును విడిచి బెల్జియం వెళ్లిపోయాడు. అయితే, ఈ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో అతను తిరిగి బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇదే మోచేయి గాయం కారణంగా అతను రెండేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్ లో రెండే మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో తను ఐపీఎల్ 16లో తిరిగి పోటీ పడుతాడా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.