ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్.. ఐదుగురి మృతి

5 killed as iron hoarding collapses in Pune
  • మహారాష్ట్రలోని పూణే జిల్లాలో విషాదం
  • గాలి, వర్షానికి హోర్డింగ్ కింద తలదాచుకున్న జనం
  • హఠాత్తుగా కూలడంతో మృత్యు ఒడిలోకి
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు ఐరన్ హోర్డింగ్ కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పింప్రీ చించ్ వాడ్ టౌన్ షిప్ లోని రావెట్ కివాలే ప్రాంతంలో... ముంబై - పూణే హైవేలో ఈ దుర్ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

ఈ ప్రాంతంలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఆ దారిన వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ హోర్డింగ్ కింద నిలబడ్డారు. అదే సమయంలో గాలి వాన మరింత ఎక్కువగా రావడంతో హోర్డింగ్ కుప్పకూలింది. దాని కింద తలదాచుకున్న ఐదుగురు ఈ ఘటనలో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. 

'గాలి బాగా వీస్తుండటంతో కొంతమంది ఆ ఐరన్ రాడ్ కింద తలదాచుకున్నారు. హఠాత్తుగా ఆ గాలి తాకిడికి హోర్డింగ్ కిందపడిపోయింది. దీంతో ఐదుగురు మృతి చెందారు' అని పోలీస్ అధికారి పీటీఐతో తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీశామని, సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతోందని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Go Back to Shorts
Maharashtra
pune
rain

More Telugu News