Tollywood: టాలీవుడ్ లో మరో భారీ చాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!

Janvi kapoor to pair up with Ram charan
షార్ట్స్‌లో చూడండి
అందల నటి శ్రీదేవి ముద్దులు కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. అదే సమయంలో టాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఆమె టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తారక్, జాన్వీపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శివ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్టులో భాగం కానుంది. 

రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను సంప్రదించగా.. ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం ఆమెను వరించనుంది. చరణ్ తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రం ప్రీ ప్రొడక్షన్‌లో పనుల్లో దర్శకుడు బుచ్చిబాబు  బిజీగా ఉన్నాడు.  ఇందులో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను, మరో హీరోయిన్‌గా  మృణాల్ ఠాకూర్‌‌ని తీసుకుంటారని తెలుస్తోంది.
Go Back to Shorts
Tollywood
Bollywood
janvi kapoor
Ramcharan
Jr NTR

More Telugu News