ఈ సవాల్ స్వీకరించే దమ్ము మీకుందా?: ఏపీ మంత్రి రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సవాల్ స్వీకరించే దమ్ము మీకుందా?: ఏపీ మంత్రి రోజా

Roja challenge to Chandrababu
  • ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామన్న చంద్రబాబు
  • జగన్ కు తన పాలనపై నమ్మకం ఉందని వ్యాఖ్య
  • వాలంటీర్లు జగన్ సైనికుల్లా పని చేస్తున్నారని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మంత్రి రోజా సవాల్ విసిరారు. మీ మేనిఫెస్టోను తీసుకురండి, మా మేనిఫెస్టోనూ తీసుకొస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని అన్నారు. ఈ సవాల్ స్వీకరించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. జగన్ కు దమ్ముందని, తన పాలనపై నమ్మకం ఉందని చెప్పారు. వాలంటీర్లందరూ జగన్ సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులను వాలంటీర్లు చేసి పెడుతున్నారని... అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు ఇష్టమని చెప్పారు. 

జగన్ స్టిక్కర్ల మీద కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి వైసీపీకి పోటీగా స్టిక్కర్లను అంటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని అన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని రాష్ట్రాన్ని మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.
Advertisement
Roja
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News