తనను బిగ్‌స్క్రీన్‌పై చూపించిన కెమెరామ్యాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఆగ్రహం.. వీడియో ఇదిగో!
- పంజాబ్‌పై గెలిచి బోణీ కొట్టిన హైదరాబాద్
- స్టాండ్స్‌లో సందడి చేసిన కావ్యా మారన్
- కావ్యా పాప నవ్విందంటూ నెటిజన్ల కామెంట్లు
హైదరాబాద్ మ్యాచ్‌లకు తరచూ హాజరై స్టాండ్స్‌లో సందడి చేసే కావ్యా మారన్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు. నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించడంతో ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. స్టాండ్స్‌లో నవ్వుతూ కనిపించిన ఆమె ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి అభిమానులు ‘కావ్యా పాప నవ్విందోచ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంత వరకు బాగానే ఉన్నా.. తనను బిగ్‌స్క్రీన్‌పై చూపించడంపై అసహనం వ్యక్తం చేసిన కావ్య.. కెమెరామ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హట్ రే’ అని మండిపడ్డారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.