చదువురాని సన్నాసి బండి సంజయ్ : ఎమ్మెల్యే సుమన్

Bandi Sanjay is illiterate says Balka Suman
  • జైలు నుంచి విడుదలైన తర్వాత సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న సుమన్
  • ఏదో ఘనకార్యం చేసినట్టు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారని మండిపాటు
  • సింగరేణికి కేంద్రం బొగ్గు బ్లాకులు ఇవ్వలేదని విమర్శ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువు రాని సన్నాసి అంటూ విమర్శించారు. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన తర్వాత సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమన్ స్పందిస్తూ.... జైలు నుంచి విడుదలైన వెంటనే ఎప్పటిలాగానే తిట్ల పురాణాన్ని అందుకున్నారని మండిపడ్డారు. ఈయన ఏదో ఘనకార్యం చేసినట్టు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన కుటుంబ సభ్యులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. 

సింగరేణి బొగ్గు బ్లాకులను తేదీల వారీగా వేలం పెట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... వీటి గురించి గత 2021లో ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాసినప్పటికీ సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వలేదని సుమన్ మండిపడ్డారు. సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా వేలానికి పెట్టారని దుయ్యబట్టారు.

Go Back to Shorts
Balka Suman
KCR
BRS
Bandi Sanjay
BJP

More Telugu News