జగన్ ప్రేరేపించడం వల్లే సత్యకుమార్ పై దాడి జరిగిందంటూ ప్రధానికి రఘురామ లేఖ
- అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి
- ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రఘురామ
- దాడి విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
- సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి
బీజేపీ నేత సత్యకుమార్ ఇవాళ అమరావతిలో రైతులకు మద్దతు పలికి వస్తుండగా, ఆయన కారును అడ్డుకున్న ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సత్యకుమార్ పై దాడి ఘటన పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.