నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు! గ్రూపులుగా విడిపోయి రచ్చ
- చెన్నైలో వెలుగు చూసిన ఘటన
- తన ప్రియుడికి మెసేజ్ పంపినందుకు సహచర విద్యార్థినిపై బాలిక ఆగ్రహం
- నడివీధిలో గొడవ పడ్డ ఇద్దరు బాలికలు
- వారికి మద్దతుగా రంగంలోకి దిగిన స్నేహితులు
- గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుమీద కొట్టుకున్న విద్యార్థినులు
సోమవారం సాయంత్రం ప్లన్ వన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై గొడవపడటం ప్రారంభించారు. వారిలో ఓ బాలిక తన సహచర విద్యార్థితో ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. అయితే.. తన ప్రియుడికి మరో బాలిక వాట్సాప్ మెసేజ్ పంపడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ నడిరోడ్డుమీదే గొడవపడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికల స్నేహితులు కూడా వారికి జతకూడారు. దీంతో.. వారందరూ రెండు గ్రూపులుగా విడిపోయి జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో వారు స్టూడెంట్స్‌ను విచారిస్తున్నారు.