నిజం, ధైర్యం, త్యాగం- ఇది మా వారసత్వం.. ఇదే మా బలం: రాహుల్ గాంధీ
- ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత
- రాజీవ్ గాంధీ అంత్యక్రియల దృశ్యాలను పంచుకున్న రాహుల్
- పరువు నష్టం కేసులో శిక్ష పడిన రాహుల్ పై అనర్హత వేటు వేసిన కేంద్రం
‘32 ఏళ్ల క్రితం మా నాన్న మృతదేహాన్ని మోస్తూ రాహుల్ నడి ఎండలో ఆర్మీ ట్రక్ వెనుక నడిచారు. అప్పుడు మా నాన్న మృతదేహానికి త్రివర్ణ పతాకం చుట్టారు. కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్నను మీరు అవమానించారు. ఇప్పుడు ఆ అమరవీరుడి కుమారుడిని దేశద్రోహి అంటున్నారు. అతని దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ ఇంటిపేరును ఈ కుటుంబం ఎందుకు ఉపయోగించలేదని పార్లమెంటులో ప్రధాని అడిగారు. అలా ప్రశ్నించి మీరు మా మొత్తం కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానించారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పేర్కొన్నారు.