తాతగారి స్థాయి నాకు సాధ్యం కాదు: నందమూరి కల్యాణ్ రామ్

nandamuri kalyanram get best actor award at chennai
  • తాతగారితో తనను పోల్చవద్దన్న నటుడు
  • ఉత్తమ నటుడిగా చెన్నై కళాసుధ తెలుగు అసోసియేషన్ నుంచి పురస్కారం
  • మాజీ గవర్నర్ నరసింహన్, అలీ, గాయని సుశీల తదితరుల హాజరు
నందమూరి కల్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. చెన్నైలోని కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ తెలుగు ఉగాది పురస్కారాల కార్యక్రమం చెన్నైలోని రాయపేటలో బుధవారం జరిగింది. ఎంతో మంది నటీనటులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తమ నటి అవార్డు సమంతను వరించింది. సమంత బంధువులు అవార్డును స్వీకరించారు. ఉత్తమ చిత్రం అవార్డును ‘బింబిసార’  బృందానికి అందించారు. 

అవార్డు అందుకున్న సందర్భంగా నటుడు, నిర్మాత కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తాతగారితో తనను పోల్చవద్దన్నారు. తాతగారి స్థాయికి తాను చేరుకోలేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా గాయని పి.సుశీల, నటుడు అలీ, గీత రచయిత చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
nandamuri kalyanram
best actor
award
chennai
kalasudha
telugu association]

More Telugu News