చున్నీలు, చేతులపై ఆన్సర్లు.. ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో విద్యార్థుల కాపీయింగ్.. డిబార్!
- ఎస్కేయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు
- కాపీ కొడుతూ దొరికిన రెండు కళాశాలల విద్యార్థులు
- అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒకరి డిబార్
పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఇన్విజిలేటర్లు తనిఖీ చేయడంతో వారి కాపీయింగ్ బాగోతం వెలుగు చూసింది. కాపీకొట్టిన విద్యార్థులందరినీ అధికారులు డిబార్ చేశారు. పరీక్షల్లో కాపీకొడుతూ అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒకరిని డిబార్ చేసినట్టు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.