కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

ED officers gives lunch break to Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి ఆమె విచారణ కొనసాగుతోంది. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఆమెను విచారిస్తోంది. కాసేపటి క్రితం ఆమెకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈడీ కార్యాలయం ఆవరణలో ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ చేత్తో పట్టుకుని కవిత నడుస్తున్న వీడియో బయటకు వచ్చింది. 

మరోవైపు ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఆమెను అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ కూడా పెరుగుతోంది. కవితను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆప్ శ్రేణులతో కలిసి వీరు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.
Go Back to Shorts
K Kavitha
BRS
Enforcement Directorate
Delhi Liquor Scam
Lunch break

More Telugu News