Advertisement

ఇందులో నువ్వు చేసింది ఏముంది జగన్?: అచ్చెన్నాయుడు

Atchannaidu question CM Jagan over KIA
  • విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • హాజరైన కియా ప్రతినిధులు
  • తాము టీడీపీ హయాంలో వచ్చినట్టు కియా వాళ్లే చెప్పారన్న అచ్చెన్న
విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దిగ్గజ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు హాజరయ్యారు. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 

"కియా పరిశ్రమ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది 2017లో అని, కియా పరిశ్రమ 20 వేల ఉద్యోగాలు తెచ్చింది 2017లో అని, కియాను రాష్ట్రానికి తీసుకువచ్చింది టీడీపీ హయాంలో అని కియా ప్రతినిధులు ఇవాళ జీఐఎస్-2023లో చెప్పారు. ఇందులో నువ్వు చేసింది ఏముంది జగన్ రెడ్డీ? పెయిడ్ బ్యాచ్ ను కూచోబెట్టి చప్పట్లు కొట్టించుకోవడమా?" అంటూ విమర్శించారు.
Advertisement
Atchannaidu
Jagan
KIA
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News