ఇంత దారుణమైన నిజాన్ని అంగీకరించలేకపోతున్నా: తారకరత్న మృతిపై రాజశేఖర్ స్పందన

Hero Rajasekhar reacts to Tarakaratna demise
  • తారకరత్న కన్నుమూత
  • సంతాపం తెలియజేస్తున్న సెలబ్రిటీలు
  • సోషల్ మీడియాలో స్పందించిన రాజశేఖర్, లావణ్య
నందమూరి తారకరత్న మృతి పట్ల టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ స్పందించారు. తారకరత్న ఇక లేడన్న దారుణమైన నిజాన్ని అంగీకరించడానికి గుండె బద్దలవుతోందని పేర్కొన్నారు. ఎంతో సౌమ్యుడు, వినయశీలి, ప్రేమ పూర్వకంగా మెలిగే వ్యక్తి తారకరత్న అని కొనియాడారు. 

"ప్రియమైన సోదరుడా... నువ్విక మాకు లేవు... కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొనేందుకు తారకరత్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశారు. 

అటు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తారకరత్న మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం పట్ల దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. చాలా చిన్న వయసులోనే కన్నుమూశారని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని లావణ్య పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Tarakaratna
Demise
Rajasekhar
Lavanya Tripathi
Tollywood

More Telugu News