తన పెంపుడు కుక్కను ట్విట్టర్ సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టిన మస్క్!
- గత సీఈఓ పరాగ్ కంటే మెరుగ్గా పని చేస్తుందని వ్యాఖ్య
- ట్విట్టర్ తన చేతికి రాగానే పరాగ్, ఇతరులను తొలగించిన మస్క్
- మరోసారి పరాగ్ పై అక్కసు వెళ్లగక్కిన వైనం
న్యాయపోరాటం తర్వాత ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. ఈ డీల్ పూర్తయిన వెంటనే అగర్వాల్ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించారు. వారిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ తన చేతిలోకి రాగానే అనేక మార్పులు చేశారు.