'బుట్టబొమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. చీఫ్ గెస్టుగా సిద్ధూ జొన్నలగడ్డ!
- అనిఖ హీరోయిన్ గా 'బుట్టబొమ్మ'
- హీరోగా సూర్య వశిష్ఠ పరిచయం
- మలయాళ మూవీ 'కప్పేలా'కి రీమేక్
- ఫిబ్రవరి 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 4వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ వేడుకను హైదరాబాదులోని 'పార్క్ హయత్'లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈవెంటుకి సిద్ధూ జొన్నలగడ్డ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నాడు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేదిక మొదలు కానుంది.
ఇది మలయాళంలో విజయవంతమైన 'కప్పేలా' సినిమాకి రీమేక్. ఫారెస్టు ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతంలో నడిచే ప్రేమకథ. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ అన్ని కలగలసిన కథ ఇది. సూర్య వశిష్ఠ హీరోగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపించనున్నాడు.