మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య
- గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత నివాసం సమీపంలో ఆత్మహత్య
- సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
- ఘటనాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.