రెండు పదాల ట్వీట్.. సీఎస్కే అభిమానుల్లో ఉత్సాహం
- వణక్కమ్ చెన్నై అంటూ ట్వీట్ చేసిన జడేజా
- రంజీ ట్రోఫీలో భాగంగా చెన్నై చేరుకున్న సీఎస్కే ఆటగాడు
- ఉత్సాహంగా స్పందిస్తున్న సీఎస్కే అభిమానులు
చెన్నై చేరుకున్న తర్వాత జడేజా ఓ రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ‘వణక్కమ్ చెన్నై’ అన్నదే ఆ ట్వీట్. చెన్నై ప్రజలకు నమస్కారం చెప్పాడన్నమాట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడేజా కీలక సభ్యుడని తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు సీఎస్కేతో కలసి సాగుతున్నాడు. జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో జడేజా ట్వీట్ కు చెన్నై జట్టు అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
‘‘జడేజాకు చెన్నై స్వాగతం పలుకుతోంది. సీఎస్కే అభిమాన ప్లేయర్ నువ్వు’’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘‘నా అభిమాన రోల్ మోడల్ కు వణక్కమ్. మైదానంలోకి తిరిగి సింహం అడుగు పెడుతోంది’’ అని మరో అభిమాని కామెంట్ చేశాడు. సూపర్ కింగ్ కు తిరిగి స్వాగతం, జడ్డూ నీ రాకింగ్ పెర్ ఫార్మెన్స్ కోసం వేచి చూస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలతో అభిమానులు స్పందిస్తున్నారు.