టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
- చాగంటిని సలహాదారుగా నియమించినట్టు వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
- గత మూడేళ్లుగా పారాయణాలను నిర్వహిస్తున్నామన్న టీటీడీ ఛైర్మన్
- ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటిని నియమించామని వెల్లడి
ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానిక యువత భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.