ఈ ఏడాదిలోనే ప్రభాస్ .. మారుతి మూవీ రిలీజ్!
- మారుతి దర్శకత్వంలో ప్రభాస్
- హారర్ కామెడీ జోనర్లో 'రాజా డీలక్స్'
- ఈ నెల 27వ తేదీ నుంచి మూడో షెడ్యూల్
- ఈ దసరాకి విడుదల చేయాలనే ఆలోచన
అయితే ఈ సినిమా షూటింగు ఆల్రెడీ మొదలైపోయిందని తెలుస్తోంది. ప్రభాస్ పాల్గొనగా ఒక షెడ్యూల్ ను .. ప్రభాస్ లేకుండగా మరో షెడ్యూల్ షూటింగును జరిపినట్టుగా సమాచారం. ఈ రెండు షెడ్యూల్స్ కి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక మూడో షెడ్యూల్ షూటింగును ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారని అంటున్నారు.
మూడో షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొననుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారట. మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాను, ఈ ఏడాది దసరా పండుగకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.