బాలకృష్ణ, పవన్ అన్ స్టాపబుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. నంబర్ 1 ట్రెండింగ్ లో వీడియో
- సంక్రాంతి సందర్భంగా చిన్న ప్రోమో విడుదల
- ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి
- ఎడిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించని ఆహా
అయితే, సంక్రాంతి సందర్భంగా ఈ షో గ్లింప్స్ ను విడుదల చేశారు. చిన్న ప్రోమో అయినప్పటికీ హైప్ ఏర్పడింది. అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు హీరోలకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ, పవన్ లగ్జరీ కార్లలో స్టూడియోకి రాగానే అభిమానులు వారిపై పూల వర్షం కురిపించారు. సెట్ లోపలికి చేరుకోగానే పవన్ చేతిని పేకెత్తి అభివాదం చేశారు బాలకృష్ణ. ఆ వెంటనే ముందు నేను ఈయన మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అనగానే పవన్ గట్టిగా నవ్వడంతో ప్రోమో ముగిసింది. గ్లింప్స్ లో ఇద్దరి మధ్య పెద్దగా సంభాషణ లేకపోయినప్పటికీ యూ ట్యూబ్ లో ఈ గ్లింప్స్ హల్ చల్ చేస్తోంది. విడుదలై ఓ రోజు అయినప్పటికీ నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో ఇప్పటికకే 2.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. కాగా, ఈ ఎడిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయంపై ఆహా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.