Chandrababu: పిల్లలతో సరదాగా చంద్రబాబు ఆటలు... వీడియో ఇదిగో!

Chandrababu and Balakrishna have fun with grandsons
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ నేడు సంక్రాంతి సందర్భంగా నాగాలమ్మకట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, బాలయ్యల మనవళ్లు దేవాన్ష్, ఆర్యవీర్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. 

ముఖ్యంగా ఆర్యవీర్.... చంద్రబాబు సహనానికి పరీక్ష పెట్టాడు. ఆర్యవీర్... బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కుమారుడు. అయితే, తన తాతయ్య బాలకృష్ణను వదిలి... చంద్రబాబు పక్కన కూర్చున్న ఆర్యవీర్ టీడీపీ అధినేతతో ఆటలు ఆడుతూ చురుగ్గా కనిపించాడు. ఆర్యవీర్ గడుగ్గాయి చేష్టలను చంద్రబాబు కూడా ఆస్వాదించారు. 

అటు, బాలయ్య తన పెద్ద మనవడు దేవాన్ష్ కు తొడపాయసం పెడుతూ సరదాగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఆర్యవీర్ తన కాళ్లను చంద్రబాబు ఒళ్లో వేసి పెంకిపిల్లాడిలా మారాం చేయడం, ఆ చిన్నారి కాళ్లను తన చేతితో నొక్కిపెట్టి నీకిదే పనిష్మెంట్ అంటూ చంద్రబాబు కూడా చిన్న పిల్లాడిలా ఆటలు ఆడడం ఈ వీడియోలో చూడొచ్చు.

సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు నారా, నందమూరి కుటుంబాలు ప్రస్తుతం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Chandrababu
Devansh
Aryaveer
Balakrishna
Sankranti
Tirupati
TDP

More Telugu News