నన్ను గెలిపించాలని జగన్ చెప్పినప్పటి నుంచి కుట్రలు ప్రారంభమయ్యాయి: దేవినేని అవినాశ్
- జగన్ కు వస్తున్న ప్రజాదరణను ఓర్చుకోలేకపోతున్నారన్న అవినాశ్
- అన్ని వర్గాల అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారని ప్రశంస
- విజయవాడ తూర్పులో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా
టీడీపీ నేతల్లా జగన్ మాయమాటలు చెప్పడం లేదని, అన్ని వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంతో చేస్తున్నప్పటికీ జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని అన్నారు. నిజాలు బయటపడకుండా ఎల్లో మీడియా అడ్డుపడుతోందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమై, అవినాశ్ ను గెలిపించాలని చెప్పినప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతూనే ఉంటారని... ఎవరు ఎన్ని చేసినా తూర్పు నియోజవర్గంలో తాను గెలవడం, వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.