వైసీపీ నేతలకు షాక్: అంబటి, పేర్ని నానిలపై అట్రాసిటీ కేసులు
- తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలువురు వైసీపీ నేతలపై ఫిర్యాదులు
- పోలీసులు, విద్యార్థి సంఘం నేత, రైతులు ఫిర్యాదు చేసినట్టు వెల్లడి
- వైసీపీ నేతల ఫిర్యాదుతో రైతులపై కౌంటర్ కేసు నమోదు
- అన్ని ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
పోలీసుల నివేదికల ప్రకారం, తాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒక కేసు నమోదైంది. అలాగే, తాడేపల్లి తెలుగు విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఫిర్యాదుతో మరికొన్ని కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు లేళ్ల అప్పిరెడ్డి, పనుగంటి చైతన్య, వేమారెడ్డి తదితరులు నిందితుల జాబితాలో ఉన్నారు. వీరితో పాటు రైతులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
మరోవైపు, వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతులపై పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో తాడేపల్లి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుపక్షాల నుంచి అందిన ఫిర్యాదులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.