అలాంటి ప్రయాణికులను అనుమతించొద్దు.. ఎయిర్ ఇండియా సర్క్యులర్
- భద్రతకు రిస్క్ ఉందని భావిస్తే విమాన ప్రయాణానికి నిరాకరించండి
- డ్యూటీ, స్టేషన్ మేనేజర్లకు ఎయిర్ ఇండియా ఆదేశాలు
- ఏదైనా ఘటన జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచన
ప్రయాణికుల మధ్య దురుసు ఘటన ఏదైనా చోటు చేసుకుంటే, తర్వాత వారు రాజీ పడినా, సంబంధిత ఘటనపై విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూడడం తెలిసిందే. వీటి తర్వాత ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలపాలైంది. వీటిపై తాము వెంటనే స్పందించి ఉండాల్సిందని టాటా గ్రూపు చైర్ పర్సన్ చంద్రశేఖరన్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.