కుప్పంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు.. రోడ్ షోకు పయనం
- గుడిపల్లి రోడ్ షోకు బయల్దేరిన చంద్రబాబు
- రోడ్ షోకు అనుమతి లేదంటున్న పోలీసులు
- అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహిస్తామంటున్న టీడీపీ శ్రేణులు
పెద్ద గొల్లపల్లి క్రాస్, చిన్న గొల్లపల్లి క్రాస్, మాలవాని కొత్తూరు, సంగనపల్లి మీదుగా రోడ్ షో కొనసాగనుంది. గుడిపల్లి రైల్వే స్టేషన్ క్రాస్ లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అయితే రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అనుమతులు లేకున్నా రోడ్ షో నిర్వహించి తీరుతామని చంద్రబాబు, టీడీపీ నేతలు చెపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.